Published:
Updated: 05 Nov 2024 • 09:09 AM
* గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం
ఆకేరున్యూస్ డెస్క్: గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్సేన్. 555.2 కేజీల గుమ్మడికాయలోని గుజ్జును తీసి పడవగా మార్చి కొలంబియా నదిలో వాషింగ్టన్లోని నార్త్ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్ వరకు ప్రయాణించాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్ రికార్డుగా నమోదు చేశారు. గ్యారీ క్రిస్టెన్సేన్ 2013లోనే అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానికంగా నిర్వహించే పోటీలో బహుమతి గెలుచుకున్నాడు.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
