- – పోలీసుల అదుపులో పది మంది
– నలుగురిపై పోలీసుల అనుమానం
– ఒకరిని వెల్లంపల్లికి చూపించిన పోలీసులు
– కొనసాగుతున్న దర్యాప్తు - ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. అజిత్సింగ్ నగర్ వడ్డెరకాలనీకి చెందిన పది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన జగన్పై దాడి కేసుపై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. అయితే.. చీకట్లో ఘటన జరగడం, భారీ స్థాయిలో జనం ఉన్న కారణంగా అనుమానుతులను గుర్తించడం వారికి కష్టంగా మారింది. అయినప్పటికీ తాజాగా వడ్డెరకాలనీకి చెందిన పది మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందరూ 20 ఏళ్ల లోపు వయసు ఉన్న వారే. వారిలో నలుగురు ఈ దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఆ సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారు., దాడికి గల కారణాలను తెలుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక యువకుడిని వెల్లం పల్లి శ్రీనివాస్ కు చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలో నాలుగు రాళ్లను కూడా పోలీసులు సేకరించారు. వన్ టౌన్ సీసీఎస్ లో కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
———————————–
Related Stories
December 4, 2024
December 4, 2024
December 3, 2024