– కాంగ్రెస్నూ నమ్మే స్థితిలో ప్రజలు లేరు
– బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎంపీ డా.లక్ష్మణ్ కాంగ్రెస్, బీఆర్ ఎస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. బీఆర్ ఎస్ కారు పూర్తిగా షెడ్డుకే పరిమితం అయిందని విమర్శించారు. అధినేత కేసీఆర్ జాకీ పెట్టి పైకి లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అయినా లాభం ఉండడం లేదని చెప్పారు. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పై కూడా లక్ష్మణ్ విమర్శలు చేశారు. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ అన్నారు. రుణమాఫీపై రేవంత్ రెడ్డివి మోసపూరిత వ్యాఖ్యలు అని వెల్లడించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకే దిక్కులేదన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం.. కుట్రలు అని.. ప్రజలు ఆ పార్టీని కూడా నమ్మే పరిస్థితులో లేరని, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు సుస్థిరప్రభుత్వం కోసం మరోసారి మోదీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
———————