చిన్నానను ఎవరు చంపారో.. చంపించారో ప్రజలకందరికీ తెలుసు
* మా చెల్లెమ్మలను కూడా నాకు వ్యతిరేకంగా దింపాడు
* దొరికితే మా బ్రదర్స్, దొరకకపోతే వాళ్ళ బ్రదర్స్
* చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టల పాలు
* జగనన్న ముఖ్యమంత్రి అయితేనే .. రైతన్న మొఖంలో సంతోషం
* రెండు చేతులు పైకెత్తి ఇలా.. ఇలా..ఇలా…
– ప్రొద్దూటూర్ సభలో వైయస్ జగన్ ధ్వజం
ఆకేరు న్యూస్ : కటుంబాలను చీల్చడంలో చంద్రబాబునాయుడు సిద్దహస్తుడు. మా చెల్లెమ్మలను కూడా నాకు వ్యతిరేకంగా దింపాడు. చంద్రబాబు ( Chandrababu ) నమ్మించి నట్టేట ముంచడంలో ఆరితేరిన వాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ( YS jagan ) తీవ్ర స్థాయిలో ప్రొద్డుటూర్ ( Memantha Siddam ) సభలో ధ్వజమెత్తాడు. బుధవారం కడప జిల్లాలోని ఇడుపుల పాయలో వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల అనంతరం మేమంతా సిద్దం బస్సు యాత్రను ప్రారంభించారు. అనంతరం ప్రొద్డుటూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ళ అనుభవం ఉంది. మోసాలు చేయడంలో అబద్దాలు చెప్పడంలో చివరకు వెన్నపోటు పొడవడంలో కూడా అపార అనుభవం ఉంది. ఇక కుటుంబాలను చీల్చడంలో ఆయనది అందె వేసిన చేయి అని జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
* చిన్నానను ఎవరు చంపారో.. ప్రజలందరికీ తెలుసు
మా చిన్నాన వైయస్ వివేకానందా రెడ్డి (YS vivekananda Reddy )ని ఎవరు చంపారో, ఎవరు చంపించారో దేవుడికి తెలుసు. ప్రజలందరికీ తెలుసు. నేనే చంపానని చెబుతున్న హంతకుడికి బహిరంగంగా మద్దతు చెబుతున్నది మరెవరో కాదు చంద్రబాబు నాయుడు ఆయనకు కొమ్ముకాసే మీడియా సంస్థలు అన్నారు. వీరికి మద్దతుగా మరో రాజకీయ స్వార్ధం కోసం మరో ఇద్దరు కూడా రంగంలోకి దిగారన్నారు. బ్రతికి ఉంటే వివేకానంద రెడ్డి వాళ్ళకు శత్రువు అవుతారు. చనిపోతే మాత్రం మిత్రుడవుతారు. ఇదంతా నన్ను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర కాకపోతే మరేంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతులేని చంద్రబాబు నీచ రాజకీయాలకు భిన్నంగా నేనెప్పుడూ ప్రజల పక్షమేనని గర్వంగా చెబుతున్నాన్నారు. నేను ఆ దేవుడు.. ప్రజలు, ధర్మాన్ని నమ్ముకున్నాను. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. వంచన చేసిన చరిత్ర మనకు ఎప్పుడూ లేదన్నారు. నన్ను ఒక్కడిని ఓడించేందుకు చెడ్డవాళ్ళంతా కలిసి ఒక్కటయ్యారు. కేంద్రం నుంచి ప్రత్యక్షంగా ఒక పార్టీ, పరోక్షంగా మరోపార్టీ రంగంలోకి దిగింది. ఇదంతా చాలదన్నట్లు రంగంలోకి మా ఇద్దరు చెల్లెమ్మలను దించారని వైయస్ జగన్ అన్నారు.
* దొరకకపోతే మన బ్రదర్స్ ..
అపవాదులు వేయడంలో అరితేరారు. ఇటీవల విశాఖలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడక పోతే మన బ్రదర్స్.. దొరికితే మాత్రం వాళ్ళ ( వైయస్ జగన్ ) బ్రదర్స్ అనే వ్యూహంతో ప్రణాళికలు సిద్దం చేశారు. సీబీఐ వాళ్ళకు డ్రగ్స్ దొరకగానే క్షణాల్లో మా మీద నెట్టేయడానకి ప్రయత్నించారు. అసలు ఆ డ్రగ్స్ ఎవరివి అని ఆరా తీస్తే.. చంద్రబాబు నాయుడు వదినె కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉండేవారని తెలుస్తోందన్నారు.నేరం చేసేది వాళ్ళు .. నెపం మోపేది మాత్రం మన మీద అని జగన్ అన్నారు.
* మేనిఫెస్టోలోని అంశాలు … ఇలా. ..ఇలా.. లా..
చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోని అంశాలను చూపిస్తూ ఇందులోని ఏ అంశాలైనా అమలు అయినావా అని ప్రజలను ప్రశ్నించారు. ఒక్కొక్క అంశాన్ని చదువుతూ .. రైతులకు రుణ మాఫీ చేస్తూ మొదటి సంతకం చేస్తానని చెప్పారు.. చేశారా.. చేయలేదంటే రెండు చేతులెత్తి .. ఇలా.. ఇలా.. ఇలా లా ఊపాలన్నారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫి చేస్తానన్నాడు చేశాడా.. అయితే.. ఇలా.. ఇలా .. ఆడబిడ్ద పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద అకౌంట్లో 25 వేలు వేస్తానన్నాడు.. వేశాడా..? ప్రతీ ఇంటికి ఉద్యోగం.. ఇచ్చాడా..? నిరుద్యోగ భృతి ఇస్తాన్నాడు ఇచ్చాడా అని సభలో ఉన్న ప్రజలను అడిగాడు… చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చెత్త బుట్టతో సమానం. నాకు మాత్రం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిదని జగన్ చెప్పాడు. గతంలో ఎన్నడూ లేని విదంగా మన రాష్ట్రానిక పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న మరో సారి ముఖ్యమంత్రి అయితేనే రైతన్న మొఖంలో సంతోషం వస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైయస్సార్ పార్టీనే గెలిపించాలని వైయస్ జగన్ కోరారు.. ఈ సభలో కడప ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డితో పాటు కడప పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వైయస్సార్ పార్టీ అభ్యర్థలను పరిచయం చేశారు.
————————-