* కొంత కాలంగా పెళ్ళి పుకార్లు
* వనపర్తి సంస్థాన పరిధిలో ఓ గుడిలో పెళ్ళి
ఆకేరు , సినిమా: బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన హీరో సిద్దార్థ్ , ( Siddharth ) బాలీవుడ్ నటి అదితిరావు (Aditi Rao Hydari )పెళ్ళి చేసుకున్నారని తెలుస్తోంది. గత కొంత కాలంగా స్నేహంగా ఉంటున్న వీరిద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమి లేదు ఇద్దరూ కొట్టిపారేశారు. ఇపుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారని సమాచారం. వనపర్తి సంస్థాన కుటుంబానికి చెందిన అదితిరావు హైదరీ ,చెన్నయికి చెందిన సిద్దార్థ్ సూర్యనారాయణ్ అందిరికి సిద్దార్థ్గా సుపరిచితుడు. తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటించాడు. మహాసముద్రం సినిమాల్లో అదితిరావు తో కలిసి సిద్దార్థ్ నటించాడు. ఈ సమయంలోనే ఇద్దరి మద్య సాన్నిహిత్యం పెరిగిందంటున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు పార్టీల్లో, ఇతర వేడుకల్లో జంటగా కనబడుతుండడంతో ఇద్దరు పెళ్ళి చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇటీవలే ఇద్దరు పెళ్ళి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే వీరి పెళ్ళి గురించి ఇద్దరి వైపునుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. ఇద్దరికి ఇదీ రెండో పెళ్ళి . గతంలో ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు తీసుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
