* స్కూలు బస్సు బోల్తా ఘటనలో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : దక్షిణాఫ్రికా (South Africa) లోని జోహన్నెస్ బర్గ్ (Johannesburg) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకుని వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది (Overturned). బస్సులో మంటలు చెలరేగడంతో 12 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. డ్రైవర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రావిన్స్ (Gauteng Province) లోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి పశ్చిమాన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెరాఫాంగ్ (Merafong) లో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మినీబస్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే ఘోరం జరిగింది. ఒక ప్రైవేట్ స్కాలర్ ట్రాన్స్పోర్ట్ మినీబస్ (Private Scholar Transport Minibus ) మెరాఫాంగ్‌లోని కోకోసి-వెడెలా (Kokosi-Vedela) ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది విద్యార్థులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారని గౌటెంగ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులందరూ ఆరు నుంచి 13 ఏళ్ల మధ్య వయస్సున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఘటన ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాఠశాల బస్సు ను పికప్ ట్రక్ వెనక నుంచి ఢీ కొట్టిందని..దీంతో స్కూల్ బస్సు (School Bus) బోల్తాపడి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
————————-