Hyderabad Cultural Festival
* రవీంద్రభారతిలో అలరించిన కల్చరల్ ఫెస్ట్
* సే నో డ్రగ్స్ అంటూ సందేశాత్మక ప్రదర్శన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ‘హైదరాబాద్ జిందాబాద్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కల్చరల్ ఫెస్టివల్ అలరించింది. దాదాపు 170 మంది కళాకారులు 16 రకాల కళారూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ది ట్రైల్ ఆఫ్ భగత్ సింగ్” నాటకంతో పాటు ప్రగతి నగర్ విద్యార్థులు ప్రదర్శించిన “సే నో టు డ్రగ్స్”, “ఆర్గాన్ డొనేషన్” నాటికలు సమాజానికి మంచి సందేశాన్ని అందించాయి. ఓం డాన్స్ అకాడమీ, అంబేద్కర్ కాలేజీ కళాబృందాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
* కేరళ సాంప్రదాయ ప్రదర్శనలు
కల్చరల్ ఫెస్టివల్ లోగా భాగంగా తానల్ మలయాళీ సేవాసమితి ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ ‘తిరువతిర’ నృత్యం, కురుగంటి కళాక్షేత్రం వారి భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. వీటితో పాటు గురు స్వామి పేరడీ, రవుఫుద్దీన్ స్టాండప్ కామెడీ, శివ ప్రసాద్ మిమిక్రీ, రామడుగు వసంత్ మైమ్ షో, మౌనిక పపెట్ షో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారుహాజరయ్యారు.
* కళలకు పెద్దపీట
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం వివిధ సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమని అన్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించేలా కళారూపాలను ప్రచారం చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుందని, అందులో ‘హైదరాబాద్ జిందాబాద్’ వంటి పౌర సంస్థలను భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ఉచిత మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై కృషి చేస్తూ సేవలు అందిస్తున్న సదరు సంస్థను మంత్రి అభినందించారు.
* బహుమతుల ప్రదానం
హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 100 హైస్కూళ్లలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్, పాటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, పర్యావరణవేత్త డాక్టర్ జయ సూర్య, హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రముఖ టీవీ నటి మలక్పేట శైలజ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
