MLA Yashaswini Reddy Medaram Visit
* అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
* సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాం
* పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, తొర్రూరు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు జిల్లా అధికారిక పర్యటనలో భాగంగా, పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, మాట్లాడుతూ… ఆ తల్లుల దయ, ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి సేవలోనే తరిస్తానని ఈ సందర్భంగా అమ్మవార్ల సాక్షిగా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
