తమిళనాడు శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు. ఇద్దరు మృతి మరో ముగ్గురికి గాయాలు.
Published:
Updated: 09 Jul 2024 • 11:30 AM
* ఇద్దరి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్ డెస్క్ : తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
——————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
