* రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్..
ఆకేరు న్యూస్, డెస్క్: రాజస్థాన్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి 27 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. జయపుర, నాగౌర్, జోధ్‌పూర్‌లో సైబర్ సెక్యూరిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్ నిర్వహించి నిందితుల నుంచి భారీగా బ్యాంక్ చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సైబర్ ముఠాపై దేశవ్యాప్తంగా పలు సైబ్ నేరాలు నమోదవగా.. తెలంగాణలో 189, దేశవ్యాప్తంగా 2,233 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ సందర్భంగా అనుమానిత లింక్స్‌ని ఎవరూ క్లిక్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
