Thatikonda Buruj Repair Works
* ‘బురుజు మరమ్మత్తు’…పనులు ప్రారంభించిన డిడి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో 700 సంవత్సరాల క్రిందట సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన బురుజుల మరమ్మత్తు పనులను రాష్ట్ర పురాతశాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మూడు పురుషులు ఉండగా రెండు బురుజుల మరమ్మతుకు నిధులు మంజూరి అయినట్లు తెలిపారు. అందులో రూ.10 లక్షలతో గ్రామం మధ్యలో ఉన్న బురుజు మరమ్మత్తు పనులు ప్రారంభించగా రెండో బురుజు మరమ్మత్తు కోసం నిధులు మంజూరైనట్లు మూడవ బురుజు మరమ్మతుకు నిధులు మంజూరి కావలసి ఉందన్నారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ అకౌంటెంట్ రాజు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్కియాలజిస్టులు పల్లపు చంద్రశేఖర్, పిట్ట రాజశేఖర్ తోపాటు మార్కెట్ డైరెక్టర్ ఎం.వసంత్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్, వార్డు సభ్యులు బొల్లం నాగరాజు, వైట్ల బిక్షపతి, మాజీ ఉప సర్పంచ్ రాములు, మాజీ ఎంపిటిసి రమేష్, మరొక శ్రీనివాస్, నీల శ్రీను, మారపాక మధు, పులిగిల్ల రాజు, రచ్చ శీను, బద్రు నాయక్, గయాస్ తదితరులు పాల్గొన్నారు.
* “ఫలించిన వైస్ ఎంపీపీ వినతి”
సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన తాటికొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఆయన నిర్మించిన బురుజులు, గడి గోడలను మరమ్మతు చేయించేందుకు విధులు కేటాయించాలని మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి గతంలో మంత్రి జూపల్లి కి ఇచ్చిన వినతి ఫలించింది. ఫలితంగా రూ.10 లక్షలతో నేడు బురుజు మరమ్మత్తు పనులు ప్రారంభించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
