* మద్యం షాపులకు దరఖాస్తులు షురూ..
* ఈనెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమలును ప్రారంభించగా.. మద్యం షాపుల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణను మంగళవారం నుంచే ప్రారంభించింది. ఈనెల 11 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. 11న లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు అనంతరం 12న కొత్త మద్యం షాపులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం వెల్లడిరచింది. రాష్ట్రవ్యాప్తంగా 3, 396 షాపులుండగా.. ఒక్కో షాపుకు రూ.2లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
……………………………..