* అయిదు సంవత్సరాల్లో ఐదు హామీలు అమలు
* మేనిఫెస్టో విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి

ఆకేరున్యూస్, కమలాపూర్: గ్రామస్థాయిలో మేనిఫెస్టోతో సర్పంచ్‌గా పోటీ ప్రజలకు అయిదు సంవత్సరాలు – ఐదు హామీలు అంటూ…. గెలిచిన తర్వాత తప్పకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీరుస్తానని ఒక సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారానికి తెరలేపారు. వివరాల్లోకి వెళ్తే కమలాపూర్ మండలం ఉప్పల్‌పల్లి గ్రామానికి చెందిన ర్యాకం శ్రీనివాస్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేస్తానని, ఐదు సంవత్సరాలలో ఐదు గ్యారెంటీలు పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం చర్చనీయాంశమైంది.
మేనిఫెస్టోలో ఉప్పల్ పల్లి గ్రామస్తులకు ఐదు సంవత్సరాలు ఇంటి పన్ను – నల్ల పన్ను ఫ్రీగా ఇస్తానని, గ్రామంలో ఆడబిడ్డ పుడితే 5116/- డిపాజిట్ కానుక, మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు, గ్రామంలో మూతపడ్డ బడిని తెరిపించటం,నెల కు ఒక సారి హెల్త్ క్యాంప్‌లు ప్రీగా వైద్యం, అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్లు, పక్కా ఇల్లు, లోన్లు మరియు ఇతరత్రా పథకాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా అందిస్తానని పేర్కొన్నారు. ఇంకా సర్పంచ్ ఎలక్షన్ల మీద స్పష్టత రాకముందే, రిజర్వేషన్లు ఖరారు కాకముందే గ్రామాల్లో ఎలక్షన్లలో పోటీ పెరుగుతుంది. సర్పంచ్ పోటీకి మేనిఫెస్టో విడుదల చేయడం చాల విడ్డూరంగా ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామ సమస్యలను తీరుస్తానని మేనిఫెస్టో విడుదల చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
……………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
