Juvenile Justice 8 Year Old Boy Bail
* వైరల్ వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశం
* కోర్టు కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, డెస్క్ : పాఠశాలలో అక్టోబర్ 28న జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం జరిగిన విషయం తెలిసిందే.. పాఠశాలలో కేజీ చదువుతున్న 6 ఏళ్ల చిన్నారిపై మూడో తరగతికి చెందిన 8 ఏళ్ల బాలుడు ఇటుక, డస్ట్బిన్లతో దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు కాగా, ఈ కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) తాజా తీర్పునిచ్చింది.
* నేరచరిత్ర లేకపోవడం, చదువు దృష్ట్యా బెయిల్..
8 ఏళ్ల బాలుడి తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను విచారించిన బోర్డు, బాలుడికి ఎలాంటి పూర్వ నేరచరిత్ర లేదని గుర్తించింది. ఎక్కువ రోజులు కస్టడీలో ఉంచితే అతడి విద్యాభ్యాసం, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయని భావించి బెయిల్ మంజూరు చేసింది. బాలుడికి క్రమం తప్పకుండా ప్రవర్తనా కౌన్సెలింగ్ ఇప్పిస్తామని, డిజిటల్ స్క్రీన్లు, మొబైల్ గేమింగ్‌కు దూరంగా ఉంచుతామని, అవసరమైనప్పుడల్లా బోర్డు ముందు హాజరుపరుస్తామని తల్లిదండ్రులు కోర్టుకు హామీ ఇచ్చారు.
* సోషల్ మీడియా వీడియోల తొలగింపునకు ఆదేశం..
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. జువెనైల్ చట్టం సెక్షన్ 74 ప్రకారం నేరంలో ప్రమేయం ఉన్న మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయడం చట్టరీత్యా నేరం. దీంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని పోలీస్ దర్యాప్తు అధికారులను జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది.
కోలుకుని ఇంటికి చేరిన చిన్నారి..
మరోవైపు, దాడిలో తీవ్రంగా గాయపడి చండీగఢ్‌లోని PGI (PGIMER) ఆసుపత్రి ఐసియూలో చికిత్స పొందిన 6 ఏళ్ల చిన్నారి క్రమంగా కోలుకుంది. శస్త్రచికిత్సలు మరియు ప్రత్యేక వైద్యం అందించిన అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో చిన్నారిని వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో కుటుంబ సభ్యులు ఉపశమనం పొందారు.
* పాఠశాల సిబ్బందిపై చర్యలు..
విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించి, బాధితురాలిని గమనించకుండా తరగతి గదికి తాళం వేసిన పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను హర్యానా విద్యాశాఖ ఇప్పటికే సస్పెండ్ చేసింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

