* ఏటా రూ. 20వేల కోట్ల వడ్డీలేని రుణాలు
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, హైదరాబాద్: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని… ఇందులో భాగంగానే ఏటా రూ. 20వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్దేశించుకున్నామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక భవన్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించిన భట్టి.. అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గ్రామీణ మహిళల్లోనూ వ్యాపారదక్షత ఉంటుందని.. పర్యావరణానికి హాని కలగకుండా చేసే ఉత్పత్తులను ఆదరించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
