* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఆకేరున్యూస్, నర్సంపేట: తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చొద్దని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరంగల్ జిల్లా నర్సంపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా అడ్డుకున్నందుకు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారని.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఎందుకన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
