ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు జైపూర్, ఢిల్లీలో పర్యటించనున్నారు. డిసెంబర్ 11 నుంచి 13 వరకు సీఎం ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుండగా… మొదట వ్యక్తిగత పనుల నిమిత్తం రాజస్థాన్లోని జైపూర్ వెళ్ళనున్నారు. ఆ తర్వాత రెండు రోజులు ఢల్లీిలో పర్యటిస్తారు. ఢల్లీిలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల మంత్రులు, అధికారులతో చర్చిస్తారని సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ సీఎం సమావేశమై కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఢల్లీి పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ వరకు వాయిదా పడగా.. పీసీసీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యనేతలు కూడా ముఖ్యమంత్రితో ఢల్లీికి వెళ్లే అవకాశముంది.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
