* అల్లు అర్జున్‌కు భువనగిరి ఎంపీ చురకలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ మానవత్వం మరిచినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో రాసిన నోట్‌ను ప్రెస్మీట్లో చదివారని విమర్శించారు. అందులో ఉన్నది చదవడం విడ్డూరంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ నటిస్తున్నట్లే ఉందని మండిపడ్డారు. ఆయన నటించిన సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండి రేట్లు పెంచారని చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పారని తెలిపారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ బాధ్యతగా ఉండాలని అల్లు అర్జున్‌కు సూచించారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
