* పోలీసు విధి నిర్వహణలో వి.క్యూ.టీ విధానం
* ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పాటు చేశాం
* ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నాం
* వార్షిక నేర నివేదిక విడుదల చేసిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పోలీసు విధి నిర్వహణలో కొత్తగా వి.క్యూ. టీ(V.Q.T) విధానం అవలంబిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు (RACHAKONDA CP SUDHEERBABU) తెలిపారు. కేసులను తొందరగా పరిష్కరించేందుకు సాంకేతికత వినియోగాన్ని పెంచడం ద్వారా సత్ఫలితాలు పొందామన్నారు. రాచకొండ కమిషనరేట్‌లో ఆయన వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. వి.క్యూ.టీ లో వి.. అంటే విజిబుల్ పోలీసింగ్(VISIBLE POLICING), క్యూ.. క్విక్ రెస్పాన్స్(QUICK RESPONCE).. టి.. అంటే టెక్నాలజీ(TECHNOLOGY) అని వివరించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ప్రజల భద్రతే మా ప్రాధాన్యం అన్నారు. దర్యాప్తులో భాగంగా సాంకేతికత వినియోగాన్ని పెంచామన్నారు. ఏడాదిలో రికార్డు స్థాయిలో 106 మంది నిందితులకు జీవిత ఖైదు పడేలా చేశామన్నారు. విజిజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఏఆర్ పోలీసులు, షీ టీమ్ పోలీసులు కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయడం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. మూఢ నమ్మకాల పేరుతో నేరాలకు పాల్పడుతున్న నిందితులకు శిక్ష పడేలా చేయడంలో దేశంలోనే రికార్డు సాధించామన్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
