* పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హత్య చేసిన మావోలు
ఆకేరు న్యూస్ డెస్క్ : పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ముగ్గురిని హత్య చేశారు. ఛత్తీస్గఢ్ (Chathighad)లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమని భావిస్తూ ముగ్గురిని చంపేశారు. నిన్న బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలో ముగ్గురిని హత్య చేశారు. ముఖేష్ హేమ్లా అనే వ్యక్తిని కాల్చిచంపేసినట్లు తెలిసింది. కాగా, కోరాచోలిలో ప్రజాకోర్టు (Praja court) నిర్వహించి ఇద్దరికి ఉరి వేశారు. పోలీస్ ఇన్ఫార్మర్మర్లను హత్య చేసినట్లు కరపత్రాలను వదిలివెళ్లారు. ఈ హత్యలకు తామే కారణమని గంగులూరు ఏరియా కమిటీ ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
