ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అశోక్ నగర్‌లోని హాస్టల్ లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా (KAMAREDDY DISTRICT) గాంధారి మండలానికి చెందిన గూగులోతు సురేఖకు, నిజామాబాద్(NIZAMABAD)కు చెందిన అబ్బాయితో గత నెలలో నిశ్చితార్థమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వివాహం కూడా నిశ్చయమైంది. హైదరాబాద్ అశోక్ నగర్(ASHOKNAGAR)లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సురేఖ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో ఈరోజు పోస్టుమార్టం (POSTMARTEM)నిర్వహించారు. ఈక్రమంలో గాంధీ ఆస్పత్రి వద్దకు నిరుద్యోగ జేఏసీ (JAC) నాయకులు చేరుకున్నారు. సురేఖ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సురేఖ సూసైడ్‌పై నిజాలను పోలీసులు వెల్లడించాలని, సూసైడ్ నోట్ బయటపెట్టాని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఆందోళన చేపట్టడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలాఉండగా.. కుమార్తె మృతితో ఆమె తల్లి విలపిస్తున్న తీరు చూసిన వారిని కలచివేసింది.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
