* అధికారులతో పాటు ఎవరినీ వదిలిపెట్టం..
* పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్
ఆకేరున్యూస్, హుజూరాబాద్: నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు. మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని కాంగ్రెస్ నేతలను పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవి సంజయ్‌కు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌తో గెలవాలని డిమాండ్ చేశారు. వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారని చెప్పారు. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు. మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు అధికారులతో పాటు ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు.
BRS MLA Padi Kaushik Reddy and Jagitial MLA Dr Sanjay engage in a fight over which party the later belongs to, in a review meeting of erstwhile Karimnagar district pic.twitter.com/Td8Ncenoll
— Naveena (@TheNaveena) January 12, 2025
………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
