Mahendragiri Varahi Movie pre release
* చాలా పెద్ద హిట్ అవుతుంది
* ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అఖిల్ అక్కినేని
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. హీరో అఖిల్ అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* థియేటర్లో చూడాల్సిన సినిమా
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌ను నిర్మించిన నిర్మాత లక్ష్మణ్‌కు అభినందనలు తెలిపారు. ఈ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే మంచి కంటెంట్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే ‘మహేంద్రగిరి వారాహి’ కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అనిపిస్తోందన్నారు. తన చిన్నప్పటి నుంచి సుమంత్ అన్న ఒడిలోనే పెరిగానని, తనకు ఏది కావాలన్నా ఎక్కువగా సుమంత్‌నే అడిగేవాడినని అఖిల్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఎప్పుడూ తనకు నో చెప్పలేదని, ఈరోజు ఆయన సినిమా వేడుకలో మాట్లాడటం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చిందన్నారు. సుమంత్‌ను ఉద్దేశించి ‘ఐ లవ్ యూ బ్రదర్’ అన్నారు.
* సిద్దుతో కలిసి నటించాలనుంది
సిద్దు జొన్నలగడ్డ తన సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ.. మరో సినిమా కోసం సపోర్ట్ చేస్తూ ‘మహేంద్రగిరి వారాహి’లో నటించడం అభినందనీయమని అఖిల్ అన్నారు. భవిష్యత్తులో సిద్దు సినిమాలో తాను కూడా భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దర్శకుడు సంతోష్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని, మంచి డివైన్ కంటెంట్‌తో సినిమాను తీసుకొస్తున్నారని అఖిల్ ప్రశంసించారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని, సెప్టెంబర్ 11న అందరూ థియేటర్లలో సినిమా చూసి మంచి కంటెంట్‌ను ఎంజాయ్ చేయాలని కోరారు.
* చివరి 40 నిమిషాలు షాక్ ఇచ్చాయి
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న అఖిల్‌కు అభినందనలు తెలిపారు. ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్‌పై కనిపించిందన్నారు. ‘మహేంద్రగిరి వారాహి’లోని చివరి 40 నిమిషాలు చూసి తాను షాక్ అయ్యానని, అంత అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. నిర్మాత మధుతో గతంలో సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, ఇప్పుడు ఈ సినిమాలో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. సుమంత్ ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుందని, ఈ చిత్రంలో ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. తనకు నచ్చిన కథ, పాత్ర కావడంతోనే ఈ సినిమాలో నటించానని, తన పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని సిద్దు చెప్పారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని, టీజర్, ట్రైలర్, పాటలు బాగున్నాయని అన్నారు. అనుప్ రూబెన్స్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు.
* సెకండ్ హాఫ్ దుమ్ముదులిపేస్తుంది
సుమంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా జర్నీ మూడు సంవత్సరాల క్రితమే ప్రారంభమైందన్నారు. కథ నచ్చడంతో భారీ స్థాయిలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో నిర్మాత మధు ప్రాజెక్ట్‌లోకి వచ్చారని, ఆ తర్వాత లక్ష్మణ్ చేరడంతో సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దాదాపు 150 థియేటర్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సినిమా వెనుక ఏదో శక్తి ఉన్నట్లు అనిపించిందన్నారు. సిద్దు జొన్నలగడ్డతో కలిసి చేసిన సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సుమంత్ చెప్పారు. సిద్దు వచ్చిన తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్లిందని అన్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ దుమ్ముదులిపేస్తుందని, సినిమాపై తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని తెలిపారు.
* బ్రహ్మానందం కొత్తగా కనిపిస్తారు
బ్రహ్మానందం మాట్లాడుతూ.. సుమంత్ అద్భుతమైన నటుడని, మంచి వ్యక్తి అని ప్రశంసించారు. పాత్రకు ఏం అవసరమో దానికి తగ్గట్టుగా ఆయన నటిస్తారని చెప్పారు. సిద్దు జొన్నలగడ్డ కూడా సినిమాలో చక్కని పాత్ర చేశారని అన్నారు. ‘మహేంద్రగిరి వారాహి’లో తాను చాలా డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తానని బ్రహ్మానందం తెలిపారు. దర్శకుడు సంతోష్‌కు నటుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకునే ప్రతిభ ఉందని, సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.
* అఖిల్ మా లక్కీ చార్మ్
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. అఖిల్ తమకు లక్కీ చార్మ్ అని అన్నారు. గతంలో ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్‌ను అఖిల్ లాంచ్ చేశారని, ఆ సినిమాకు మంచి పేరు, ఆదరణ లభించిందని గుర్తుచేశారు. ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’కి అంతకంటే పది రెట్లు ఆదరణ రావాలని కోరుకున్నారు. సిద్దు జొన్నలగడ్డ కథ, పాత్ర నచ్చడంతో సినిమాలో భాగమయ్యారని, ఆయన వల్ల సినిమా మరో స్థాయికి వెళ్లిందని చెప్పారు. నిర్మాతలు మధు, లక్ష్మణ్ ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. బ్రహ్మానందం, అలీ సహా ప్రతి ఒక్కరూ మంచి పాత్రలు చేశారని అన్నారు.
సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పనిచేయడం భిన్నమైన అనుభవమని తెలిపారు. దర్శకుడు, సుమంత్, నిర్మాత మధు ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. ఇది చాలా డిఫరెంట్, భారీ స్థాయిలో రూపొందిన సినిమా అని అన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, సెప్టెంబర్ 11న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
నిర్మాత మధు మాట్లాడుతూ.. ‘మహేంద్రగిరి వారాహి’ చేయడం నిర్మాతలుగా తమ అదృష్టమన్నారు. సిద్దు జొన్నలగడ్డ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లారని, సుమంత్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ‘రంగమార్తాండ’తో ఒక అడుగు ముందుకు వెళ్లానని, ఈ సినిమాతో మరో పది అడుగులు ముందుకు వెళ్తాననే నమ్మకం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అలీ, మీనాక్షి గోస్వామి, మంజు భార్గవి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
