* అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అడ్డుకున్న సైఫ్
* తప్పించుకునే ప్రయత్నంలో కత్తితో దాడి
* హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
ఆకేరున్యూస్, ముంబై: నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున ముంబైలోని తన ఇంటి వద్ద ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శబ్దాలు రావడంతో అతనికి మేలుకువ వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనానికి యత్నించగా సైఫ్ అతడిని పట్టుకోబోయాడు.. అయితే, ఆ దుండగుడు సైఫ్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఆగంతకుడు సైఫ్‌పై ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హుటాహుటినా అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాంద్రా పోలీసులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేశారు. సైఫ్ అలీఖాన్‌ను బాంద్రా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని, తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారని లీలావతి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నీరాజ్ తెలిపారు. సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించింది.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
