Published:
Updated: 18 Jan 2025 • 04:58 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డు అప్రమత్తం చేసింది. వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజును ఇప్పటికీ చెల్లించని విద్యార్థులు.. ఆలస్య రుసుం రూ. 2500తో జనవరి 25 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇంటర్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులతో పాటు ప్రయివేటు విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 217 కాలేజీల్లోని 70 వేల మంది విద్యార్థులకు ఊరట కలిగింది.
…………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
