* వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ ..
ఆకేరు న్యూస్, ధర్మవరం | ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరం(Darmavaram)లో నిన్నటి నుంచీ రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. తెలుగుదేశం(tdp), వైసీపీ(ycp) కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. నిన్న జరిగిన రాళ్ల దాడిలో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈరోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. వైసీపీకి చెందిన మైనార్టీ నాయకుడు జమీర్ (Jameer) బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం ఘర్షణకు దారి తీసింది.
నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సమక్షంలో జమీర్ తన అనుచరులతో నేడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కూటమిలో భాగస్వామైన బీజేపీ(Bjp)లో జమీర్ చేరడాన్ని నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే జమీర్ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపివేయడంతో వివాదం మొదలైంది. ఉద్రిక్తతల నేపథ్యంలో కాసేపట్లో పరిటాల శ్రీరామ్ (Paritala Sriram)తన కార్యకర్తలతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
