* ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలు.
* ప్రయాణికులు అందరూ హసన్పర్తి మండలంలోని మునిపల్లి, చింతగట్టు వాసులు
* కూలీ పనుల నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం
ఆకేరున్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలం గూడూరు- అంబాల రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ట్రాలీ, ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో వ్యవసాయ కూలి పనులు ముగించుకొని వారి స్వస్థలం ఆయిన హసన్పర్తి మండలంలోని మునిపల్లి, చింతగట్టుకు వెళ్లే క్రమంలో ఆటో ట్రాలీ డ్రైవర్ అతివేగంగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ట్రాలీలో 22 మంది ప్రయాణిస్తుండగా.. 11 మందికి తీవ్ర గాయాలు కాగా,వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్కి తరలించినట్లు కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు.


……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
