* వేదిక కుప్పకూలి ఏడుగురి మృతి
* 60 మందికి పైగా గాయాలపాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని బాగ్‌పత్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఆదినాథ్ ఆలయంలో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. భయంతో జనం పరుగులు తీశారు. తోపులాటలో ఏడుగురు మృతి చెందారు. 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. బరౌత్ నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని గాంధీ రోడ్డులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. డీఎం అస్మితాలాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ ఆసుపత్రులకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. లడ్డూ మహోత్సవం (Laddu Mahothsawam) కోసం 65 అడుగుల ఎత్తులో చెక్కలతో వేదికను నిర్మించారు. దానిపై 4-5 అడుగుల ఎత్తున దేవుడి విగ్రహం పెట్టారు. దేవుడి విగ్రహాన్ని సందర్శించడానికి భక్తులు చెక్కలతో నిర్మించిన మెట్లు ఎక్కే క్రమంలో మెట్లు విరిగి ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో పలువురు భక్తులు స్జేజీ కింద పడిపోయారు. దీంతో భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో అటుఇటు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ (Cm Yogi Adityanath) స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
