* మౌనీ అమావాస్యన నిర్వహించే స్నానం అత్యంత పవిత్రం
* ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం
ఆకేరున్యూస్, ప్రయాగ్‌రాజ్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభమేళా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఘనంగా కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. కాగా,, 144 ఏండ్ల తర్వాత వచ్చిన ఈ కుంభమేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అలాగే మౌనీ అమావాస్య. మహా కుంభమేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో ఈ రోజు భక్తులు రోజూ కంటే అధిక సంఖ్యలో త్రివేణీ సంగమానికి పోటెత్తి నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం 6 గంటల వరకు ఏకంగా 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇక మహాకుంభ మేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకూ మొత్తం 19.94 కోట్ల మంది ప్రజలు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడిరచింది. మౌనీ అమావాస్య సందర్భంగా ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాల కోసం తరలివస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లూ చేశామని ప్రభుత్వం వెల్లడిరచించి.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
