Published:
Updated: 30 Jan 2025 • 04:28 AM
* ఆమె కుమారుడు ఎక్కడ?
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ – జగిత్యాల హైవే (Karimnagar-Jagityala Highway)పక్కన కాలువలో మహిళ మృతదేహం ఉందని అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతురాలు మంచిర్యాల(Manchiryala)కు చెందిన మమతగా గుర్తించారు. మంచిర్యాలలో కుమారుడితో కలిసి కారులో బయలుదేరిందని తెలుసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన ఆమె హైవే పక్కన శవమై కనిపించడం కలకలం రేపుతోంది. మమతను ఎవరు చంపారు, కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
……………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
