ఆకేరున్యూస్, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి మూడు దేశాలపై భారీ ట్యాక్స్ విధించి రaలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో, చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దేశంలో తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ట్రంప్ వెల్లడిరచారు. మెక్సికో, కెనడా దిగుమతులపై 25 శాతం , చైనాపై 10 శాతం అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ట్యాక్స్ మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రవాణాలో ఉన్న వస్తువులు, కటాఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దుల్లోకి వచ్చే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉండనుంది.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
