Rahul Gandhi and Amith Sha
* అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో ఊరట
* పరువునష్టం కేసులో నిర్దోషిగా ప్రకటించిన సుల్తాన్పూర్ కోర్టు
ఆకేరు న్యూస్, డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ప్రత్యేక ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు సోమవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. న్యాయమూర్తి శుభమ్ వర్మ తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ కోర్టులోనే ఉన్నారు.
* 2018 కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో వ్యాఖ్యలపై వివాదం..
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో రాహుల్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను ఉద్దేశించి.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును ప్రస్తావిస్తూ ఆయన ఈ విమర్శ చేశారు.
ఆ కేసు నుంచి అమిత్ షాను ప్రత్యేక సీబీఐ కోర్టు 2014లోనే డిశ్చార్జ్ చేసింది. రాహుల్ వ్యాఖ్యలు అమిత్ షా పరువుకు భంగం కలిగించాయంటూ సుల్తాన్‌పూర్‌కు చెందిన బీజేపీ నేత, జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. 2023 నవంబరు 27న విచారణకు హాజరుకావాలని కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.
అనంతరం ఆయన కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. విచారణ సందర్భంగా తనపై ఆరోపణలను రాహుల్ తిరస్కరించారు. రాజకీయ ఉద్దేశాలతో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆయన తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కూడా కేసుకు ఆధారాలు లేవంటూ దాన్ని కొట్టివేయాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

