అంకంపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం.
* 14 మంది వైద్యులతో రోగులకు వైద్య సేవలు..
* ఉచితంగా మందుల పంపిణీ
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అంకంపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇరుప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సేవా భారతి హాస్పిటల్, హైదరాబాద్, వనవాసి కళ్యాణ్ పరిషత్, సేవంకూర్ భారత్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొత్తం 14 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు.
విద్య, సామాజిక సేవల్లోనూ ముందడుగు
సేవా భారతి సంస్థ ఆధ్వర్యంలో బాలికల విద్యకు ప్రోత్సాహం, పాఠశాలల అభివృద్ధి, హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేవంకూర్ భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలతో పాటు విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇరుప వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ విజయ్ కాంత్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రోజా, వనవాసి ములుగు జిల్లా మెడికల్ క్యాంప్ ఇన్చార్జి బండారి జగదీష్, కార్యదర్శి ఇరుప నాగేశ్వరరావు, వైద్య బృందం సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

