* యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి కూడా ..
* వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి.
* లేదంటే పరువు నష్టం దావా వేస్తా
– బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ( Konda SureKha ) కు బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ ( KTR ) లీగల్ నోటీసులు పంపించారు. ఫ్యోన్ ట్యాపింగ్ లాంటి సంబంధం లేని అంశాల్లో తన పేరును వాడుతూ పరువుకు భంగం కలిగిస్తున్నారని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేదంటే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. యెన్నం శ్రీనివాస రెడ్డి, కేకే మహేందర్రెడ్డిలు కూడా తన పరువుకు భంగం కలిగించే విదంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ ఇద్దరికి కూడా లీగల్ నోటీస్లు నోటీస్లు పంపించానని కేటీఆర్ తెలిపారు. కుట్ర పూరితంగా ఈ ముగ్గురు తన మీద విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే విదంగా తన మీద సీఎం తో సహా ఎవరైనా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరం గా స్పందిస్తానని కేటీఆర్ అన్నారు.
————————————