ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి 27 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
