Uppal Pochamma Bonalu Celebrations
* చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ
– హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో బుధవారం సాంప్రదాయ వేడుకలు, అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, గ్రామ ప్రజలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
హుజురాబాద్-పర్కాల ప్రధాన రహదారిపై కన్నూర్ క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ ధీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన నిమిత్తం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహ ప్రతిష్టాపన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం, గ్రామంలో బుడగ జంగాల సోదర, సోదరీమణులు ఘనంగా నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో జరిగే ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయినేని తిరుపతిరావు,మాజీ జెడ్పిటిసి మారపల్లి నవీన్ కుమార్, బుడగ జంగాల కులస్తులతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ సర్పంచ్ రమ నాగరాజు, ఉప సర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, బేడ బుడగ జంగాల కులస్తులు, మండల బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
