Polytechnic Students Protest
* జీవో నంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జీవో నెంబర్ 97ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోలిటెక్నీక్ విద్యార్థుల బుధవారం మండల కేంద్రంలో స్థానిక శివాజీ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యునుస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. G.O 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులు బి.టేక్ 2nd ఇయర్ కి వెళ్లే అవకాశన్ని కోల్పోతారు అన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖకు ఒక మంత్రిని నియమించి విద్యార్థులకు ఉపయోగపడే G.O లు తెస్తే బాగుంటుంది కానీ విద్యార్థుల భవిష్యత్ ను అంధకారంలో ముంచె g.o లను ఎట్టి పరిస్థితి లోను విద్యార్ధి సంఘాలు ఉపేక్షించేది లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం g.o 97 ను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో అసెంబ్లీ ని ముట్టడిస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు పస్తం పృథ్విరాజ్, బుస్సా రోహిత్, రియాజ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
