* నిపుణులను సంప్రదించకుండానే ఎస్ఎల్బీసీ పనులు
* ఎస్ఎల్బీసీ ఘనటకు సీఎం రేవంత్‌దే పూర్తి బాధ్యత
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎంకు ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్ల నాటి ప్రాజెక్టు పనులను నిపుణులను సంప్రదించకుండానే ప్రారంభించారని, 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకోవడానికి అదే కారణమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇతరులను నిందించడం మానుకుని పనిపైన దృష్టిపెట్టాలని సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకున్న ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను నిందించడంపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి పని చేతగాదని మండిపడ్డారు. ‘ఆయనకు ఎలా పని చేయాలో తెలియకపోతే ఇతరులపై ఆరోపణలు చేయడం సులభంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కార్మికులు టన్నెల్ చిక్కుకుని ఇన్ని రోజలవుతున్నా ఇప్పటిదాకా వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని, వారు బతికున్నారో మరణించారో కూడా ఎవరికీ తెలియదన్నారు. రేవంత్ రెడ్డి ఇతరులపై నిందలు వేయడం మానుకుని పనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, మాటతీరు ముఖ్యమంత్రి లాగే ఉండాలని, చవకబారు మంత్రిలా ఉండకూడదన్నారు.
……………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
