* శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, హైదరాబాద్: 2025-26 వార్షిక బడ్జెట్ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1674 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.5734 కోట్ల చొప్పున కేటాయించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇది మూడో బడ్జెట్ ప్రసంగం. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీ తనంతో సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడుగుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామన్నారు. భారతదేశాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం అమలుచేసే పటిష్ట దేశంగా చూడాలని అంబేద్కర్ నొక్కిచెప్పారన్నారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన నైకిత విలువను పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ బడ్జెట్- రూ.3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు
మూలధన వ్యయం- రూ.36,504 కోట్లు
వ్యవసాయ శాఖ- 24,439 కోట్లు
పశుసంవర్థక శాఖ- రూ.1674 కోట్లు
పౌరసరఫరాల శాఖ- రూ.5734 కోట్ల
విద్యారంగం- రూ.23,108 కోట్లు
కార్మిక శాఖ- రూ.900 కోట్లు
పంచాయతీరాజ్- రూ.31,605 కోట్లు
మహిళా శిశుసంక్షేమ శాఖ- రూ.2,862 కోట్లు
ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం- రూ.11,405 కోట్లు
మైనారిటీ సంక్షేమం- రూ.3,591 కోట్లు
ఐటీ శాఖ- రూ.7,704 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖ- రూ.12,393 కోట్లు
విద్యుత్ శాఖ- రూ.21,221 కోట్లు
హెచ్ సిటీ డెవలప్మెంట్- రూ.150 కోట్లు
మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ- రూ.17,677 కోట్లు
నీటి పారుదల శాఖ- రూ.23,373 కోట్లు
రోడ్లు భవనాల శాఖ- రూ.5,907 కోట్లు
పర్యాటకశాఖ- రూ.775 కోట్లు
క్రీడా శాఖ- రూ.465 కోట్లు
ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్- రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ- రూ.190 కోట్లు
హోంశాఖ- రూ.10,188 కోట్లు
……………………………
