Headmaster Assault Attempt Arrest
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: పాఠశాలలో విద్యార్థులకు బుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రధానోపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. ఆడుకుంటూ తన ఇంట్లోకి వచ్చిన నాలుగేళ్ల పసికందుపై అత్యాచార యత్నానికి పాల్పడిన దారుణ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి హెడ్మాస్టర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
* పోలీసులు మరియు బాధితుల కథనం ప్రకారం..
వర్ధన్నపేట మండలం బండౌతాపురం (బండోతపురం) గ్రామానికి చెందిన తాటికాయల భాస్కర్ (50) జఫ్ఫర్గఢ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా (HM) విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ నెల 26న మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ పక్కనే ఉన్న భాస్కర్ ఇంట్లోకి వెళ్లింది.
కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో తల్లి వెతుక్కుంటూ భాస్కర్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో భాస్కర్ పాప పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ప్రైవేట్ భాగాలను తాకుతూ అత్యాచార యత్నానికి పాల్పడుతున్నట్లు గమనించారు. అనంతరం జరిగిన దారుణాన్ని చిన్నారి కూడా తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
* కేసు నమోదు.. నిందితుడు రిమాండ్‌కు..
బాధిత చిన్నారి తల్లి వెంటనే వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి మంగళవారం నిందితుడైన హెచ్ఎం తాటికాయల భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు వెల్లడించారు. పసికందుపై దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
