Waste Segregation Awareness Program
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తడి, పొడి చెత్తను నిర్దేశించిన చెత్త బుట్టలో వేసి ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలని గ్రామ సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో మంగళవారం తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక చెత్త పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ద్వారా ప్రజలకు ఏ చెత్తను ఏ డబ్బులు వేయాలో అనే అంశంపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త తో పాటు నిరుపయోగమైన వస్తువులను నిర్దేశించిన డబ్బాలో వేసి గ్రామ పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు వార్డు సభ్యులు పూల్యల నారాయణరెడ్డి, కుక్కల లక్ష్మయ్య, ఈశ్వరయ్య, అన్నం రాజు, మార్కండేయ, భోగం షర్మిల ఫీల్డ్ అసిస్టెంట్ కెంగర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
