* మంత్రి కొండా సురేఖ
ఆకేరున్యూస్, వరంగల్: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ విభాగం ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్ని మాపక వారోత్సవాల నేపథ్యంలో వరంగల్ జిల్లా ఆధ్వర్యం లో రూపొందించిన వాల్పోస్టర్లు, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘‘అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అని అన్నారు. వేసవి కాలం నేపధ్యం లో అగ్ని ప్రమాదాలు సంబంధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇందుకు సంబంధించి అగ్నిమాపక విభాగం వారు రూపొందించిన కరపత్రాలు గోడపత్రాల ద్వారా ప్రజలు అవగాహన పొంది ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, భోగి సువర్ణ సురేష్, దిడ్డి కుమారస్వామి, డిఎఫ్ఓ కే వి సతీష్ కుమార్, ఎస్ఎఫ్ఓ రాజేశ్వర్ రావు, జమేధార్ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
