* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరున్యూస్, వరంగల్: భారత రాజ్యాంగ నిర్మాత డా,బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మైలారం నుండి రాయపర్తి మండల కేంద్రం దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీలు, మహిళా కొలాటాలతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, దళిత బహుజన నాయకులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసన సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నాను. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారన్నారు అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తులకు పేరుపేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నారు. అణగారిన వర్గాలకి డా బి ఆర్ అంబేద్కర్ ఆశా కిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని కొనియాడారు. దళితులందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్షను తీసుకొని మంచి మార్గంలో నడుస్తూ ఆయన చేసిన సేవలను ప్రజలకు వివరించాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
