* మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఉత్తరప్రదేశకు చెందిన రంజాన్ కూలీ పనుల కోసం గిర్మాజీ పేటకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పక్కనే ఉన్న మూడేళ్ల బాలికపై అతడి కన్ను పడిరది. ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై లైంగిదాడికి యత్నించారు. బాలిక ఏడ్వడంతో స్థానికులు అక్కడకు చేరుకుని అతడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో, అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
