* తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌లా మారింది..
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్
ఆకేరున్యూస్, హన్మకొండ: రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలకు కష్టమొచ్చినా తెలంగాణ భవన్‌కు వస్తున్నారని అన్నారు. జనతా గ్యారేజీ మాదిరిగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ గులాబీ జెండాకు జై కొడుతున్నారని.. రజతోత్సవ సభకు వరంగల్ వేదిక కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ఎల్కతుర్తి సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకు సభా ప్రాంగణం వద్ద రెండు నిమిషాల పాటు నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి.. బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో పురుడు పోసుకుంటున్న సంస్థ బీఆర్ఎస్ అని తెలిపారు. ాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు మీద నమ్మకం లేదని కేటీఆర్ అన్నారు. అందుకే సభ కోసం 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని.. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఎల్కతుర్తి సభ భారీ బహిరంగ సభగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
