* ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిక
* అప్రమత్తమైన జమ్ముకశ్మీర్ ప్రభుత్వం
ఆకేరు న్యూస్, డెస్క్ : కశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈక్రమంలో 50 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్ (Jammu Kasmir) ప్రభుత్వం మూసివేసింది. కాగా, పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి విచారణలో వాస్తవాలు వెల్లడవుతున్నాయి. పాక్ సైన్యానికి ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. పహల్గాం నిందితుడు హషీమ్ ముసా (Hashim Musa) పాక్ పారా కమాండోగా గుర్తించారు. పాక్ సైన్యం నుంచి తప్పుకుని కరుడుగట్టిన ఉగ్రవాదిగా హషీమ్ మారాడు. ఇప్పటి వరకు హషీమ్ మూడు ఉగ్రదాడుల్లో పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. లష్కర్ తోయిబాలో హషీమ్ మూసా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మూసా పాక్ సైనిక నేపథ్యాన్ని ఇతర నిందితులు ధ్రువీకరించారు.
…………………………………………
