* అవినీతికి చోటు లేకుండా కఠినచర్యలు
* పేదలకే ఇళ్లు దక్కేలా చూసే బాధ్యత మీదే
* యువ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన
ఆకేరున్యూస్, హైదరాబాద్: పేదోడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రూ.22వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడిరచారు. నేషనల్ అకాడవిూ ఆఫ్ కన్స్టక్ష్రన్స్ లో శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్లో 350 మంది ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆరు రోజులపాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు- అందజేశారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్టేష్రన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందరభంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లలో ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు సక్సెస్ కావాలంటే యువ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. ఇందిరమ్మ ఇండ్లకోసం శిక్షణ పూర్తిచేసుకున్న 390 మందియువ అసిస్టెంట్ ఇంజనీర్లంతా ఇందుకు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలా? ఇతర పార్టీలా అన్ని పార్టీల వారికి.. అర్హులైన పేదలకే ఇండ్లు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పేదవారికి అందాలంటే అది పేద కుటుంబాల నుంచి వచ్చిన యువ ఇంజనీర్లకే తెలుసన్నారు. ఎవరూ ప్రలోభాలు పెట్టినా డబ్బుకు ఆశపడొద్దని హెచ్చరించారు. 600 చదరపు విూటర్లు లోపే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని.. ఎక్కు జాగలో ఇళ్లు కడితే తర్వాత వచ్చే డబ్బులు ఇవ్వబోమన్నారు. మొత్తం నాలుగు దశల్లో నిధులు విడుదల అవుతుందన్నారు పొంగులేటి. గ్రౌండ్ లెవల్ లో ప్రతి ఇంటిని పరిశీలించే బాధ్యత యువ ఇంజనీర్లదేనన్నారు. ప్రతి సోమవారం అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల నిధులు రిలీజ్ చేస్తామన్నారు. డబ్బులు రిలీజ్ చేశాక ప్రతి ఇంటిని పరిశీలిస్తామన్నారు.
………………………………………….
