ఆకేరు న్యూస్, డెస్క్ : పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. తొలుత ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తోంది. ఆంక్షలతో పాకిస్తాన్ (Pakisthan) ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ క్రమంలో భారత్ (Bharath) ఏ క్షణమైన తమ దేశంపై దాడికి దిగుతోందంటూ పాకిస్థాన్లో ఓ విధమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి వేళ త్రివిధ దళాలలోని ఇద్దరు అధిపతులతో ప్రధాని మోదీ (Modi) వరుసగా సమావేశమయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ట్, ఏయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీతి సింగ్(Amar PreethSing) తో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో ప్రధాని మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అరేబియా సముద్రంలోని సరిహద్దులతోపాటు పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది.
…………………………………………….
