* పరీక్ష రాస్తున్న 22.7 లక్షల మంది
* తెలంగాణలో 190 కేంద్రాలు.. 72,507 మంది విద్యార్థులు
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష (NEET UG EXAM) ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం 500 నగరాల్లో 5,453 కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 22.7 లక్షల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు విదేశాల్లో సైతం 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ పరీక్ష సందర్భంగా సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేశారు. ఈ పరీక్ష కోసం తెలంగాణ(TELANGANA)లో 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 72,507 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాపీయింగ్‌ను అరికట్టేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బేస్డ్ రియల్ టైమ్ అనలెటికల్ టూల్స్, టెక్నాలజీని వాడుతున్నట్టు ఎన్టీఏ తెలిపింది. తప్పుగా సమాధానం రాస్తే ఒక్కో ప్రశ్నకు ఒక్కో మైనస్మార్కు కోల్పోవాల్సి ఉంటుంది.
………………………………………………………….
