ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెదక్ జిల్లా (Medak District) చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో విషాదం చోటుచేసుకుంది. వరికోత యంత్రం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఈ బాలుడిని ఢీకొనడంతో విషాదం జరిగింది. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇబ్రహీంపూర్(Ibrahimpru)లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………
